Type Here to Get Search Results !

మాలిస్‌ నాగప్ప అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి

 మాలిస్‌ నాగప్ప అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి


తెలంగాణ ఉద్యమంలో నాగప్ప సేవలు గుర్తుండిపోతాయి.. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా

పాపన్నపేట, అక్టోబర్‌ 2 (తెలుగు ట్రెండ్స్): పాపన్నపేట మండల పరిధిలోని ముద్దాపూర్‌ గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, ఏడుపాయల దేవస్థానం మాజీ ధర్మకర్త మాలిస్‌ నాగప్ప అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. నాగప్ప మృతి విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి ముద్దాపూర్‌ గ్రామానికి చేరుకుని ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నాగప్ప అంత్యక్రియల్లో పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ మాలిస్‌ నాగప్ప మృతి బీఆర్‌ఎస్‌ పార్టీతో పాటు ముద్దాపూర్‌ గ్రామానికి తీరని లోటని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో నాగప్ప చురుగ్గా పాల్గొన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంతో పాటు పార్టీ బలోపేతానికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ కార్యకర్తలకు అండగా నిలిచారని తెలిపారు. నాగప్పతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం నాగప్ప కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి పార్టీ తరఫున, వ్యక్తిగతంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేశారు. నాగప్ప అంత్యక్రియల్లో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏడుపాయల మాజీ చైర్మన్‌ పట్లోళ్ల విష్ణువర్ధన్‌రెడ్డి, పాపన్నపేట మండల పార్టీ అధ్యక్షుడు గంగుల విష్ణువర్ధన్‌రెడ్డి, పాపన్నపేట మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు వడ్ల కుబేరుడు, సర్పంచ్‌ సాయిరెడ్డి, మాజీ సర్పంచ్‌లు లింగారెడ్డి, మల్లేశం, ఏడుపాయల మాజీ డైరెక్టర్లు అంటోని, ప్రభుగౌడ్‌, సంగప్ప, గౌరీశంకర్‌, మంద నాగయ్య, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు దుర్గయ్య, బాబాగౌడ్‌, బీస గోపాల్‌, అనిల్‌రెడ్డి, యేసురత్నం, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నా



రు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language