విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి
ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్ష
మెదక్, సెప్టెంబర్ 20 (తెలుగు ట్రెండ్స్):
విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం మెదక్ పట్టణంలోని తారకరామానగర్ కాలనీలో ఏర్పాటు చేసిన శ్రీ ఛత్రపతి శివాజీ గణేష్ మండపాన్ని ఆమె సందర్శించారు.
ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు. అనంతరం కాలనీ పెద్దలను పలకరించి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గణేష్ మండపం వద్ద చిన్నారులతో సరదాగా గడిపి వారిని ఆప్యాయంగా పలకరించారు.
ఈ సందర్భంగా పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడంతో పాటు నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మెదక్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మామిండ్ల ఆంజనేయులు, జీవన్రావు, బీఆర్ఎస్ నాయకులు బి. సాయికుమార్, శ్రీనివాస్, క్రాంతి, సాయికిరణ్ గౌడ్, మోతీలాల్, పార్థుబాబు, సంతోష్, సుధీర్, కార్తీక్, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

