Type Here to Get Search Results !

మల్లంపేట శివారులో విషాదం.. ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

 


ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య

మల్లంపేట శివారులో ఘటన.. కేసు నమోదు చేసిన పోలీసులు

పాపన్నపేట, సెప్టెంబర్ 20 (తెలుగు ట్రెండ్స్):
పాపన్నపేట మండల పరిధిలోని మల్లంపేట గ్రామ శివారులో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మల్లంపేట గ్రామానికి చెందిన కోరబోయిన సాయిలు (41) చేపలు పడుతూ జీవనం సాగించేవాడు.

గత కొన్ని రోజులుగా పనికి వెళ్లకుండా ఇంటివద్దే ఉంటుండటంతో చిన్నపాటి అప్పులు అయినట్లు పోలీసులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం సాయిలు మద్యం సేవించి ఇంటికి రావడంతో భార్య నాగరాణి మద్యం ఎందుకు సేవించావని ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో కోపంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన సాయిలు అనంతరం గ్రామ శివారులోని నర్సాద్రి కుంట సమీపానికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

ఆదివారం మధ్యాహ్నం అటువైపు వెళ్లిన స్థానికులు సాయిలు చెట్టుకు ఉరి వేసుకుని ఉండటాన్ని గమనించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

మృతుడి భార్య నాగరాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు దర్యాప్తులో వెల్లడించాల్సి ఉంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language