Type Here to Get Search Results !

ఏడుపాయల మాజీ డైరెక్టర్‌ నాగప్ప మృతి.. పార్టీకి తీరని లోటు: కంఠారెడ్డి తిరుపతిరెడ్డి

 ఏడుపాయల మాజీ డైరెక్టర్‌ నాగప్ప మృతి పార్టీకి తీరని లోటు


కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి

పాపన్నపేట, అక్టోబర్‌ 2 (తెలుగు ట్రెండ్స్): పాపన్నపేట మండల పరిధిలోని ముద్దాపురం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు, ఏడుపాయల మాజీ డైరెక్టర్‌ మాలిస్‌ నాగప్ప అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. నాగప్ప మృతి విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు, మెదక్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ముద్దాపురం గ్రామానికి వెళ్లి నాగప్ప భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కంఠారెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ మాలిస్‌ నాగప్ప పార్టీకి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. పార్టీ కార్యకలాపాల్లో నాగప్ప చురుకుగా పాల్గొంటూ అందించిన సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ఆయన మృతి పార్టీకి, స్థానిక నాయకులు, కార్యకర్తలకు తీరని లోటని అన్నారు. నాగప్ప కుటుంబానికి పార్టీ నాయకులు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు. నాగప్ప మృతికి పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏడుపాయల మాజీ చైర్మన్లు సాతెల్లి బాలగౌడ్‌, పట్లోళ్ల విష్ణువర్ధన్‌రెడ్డి, పాపన్నపేట మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పోలీస్‌ వెంకట్రాంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు వడ్ల కుబేరుడు, సర్పంచ్‌ సాయిరెడ్డి, మాజీ సర్పంచ్‌లు లింగారెడ్డి, శ్రీనాథ్‌రావు, ఏడుపాయల మాజీ డైరెక్టర్లు ఆంటోనీ, ప్రభుగౌడ్‌, గౌరీశంకర్‌, శ్రీనివాస్‌రావు, మంద నాగయ్య, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు దుర్గయ్య, బాబాగౌడ్‌, అనిల్‌రెడ్డి, బీస గోపాల్‌, వినయ్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కసిరెడ్డి మాణిక్యరెడ్డి, నాయకులు చంద్రమోహన్‌గౌడ్‌, కిరణ్‌గౌడ్‌, గంజి నవీన్‌, నైముద్దీన్‌, తలారి సంతోష్‌, నాగరాజు తదితరులు పాల్గొన్నా


రు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language