*జాతిపిత మహాత్మాగాంధీ ఘన నివాళులు*
*తెలుగు ట్రెండ్స్, అందోలు:*
జాతిపిత మహాత్మాగాంధీ 157 వ జయంతి సందర్భంగా జోగిపేట పట్టణంలో బీఆర్ఏస్ నాయకులు ఆ మహాత్ముడికి ఘన నివాళులు ఆర్పించారు. స్థానిక చారిత్రక కట్టడమైనా మధ్యరంగం (క్లాక్ టవర్) లోనీ ముసిముసి నవ్వుల పాలరాతి బాపుజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఏఎంసీ మాజీ చైర్మన్ డిబి. నాగభూషణం, బీఆర్ఏస్ నాయకులు చాపల వెంకటేశం, సార శ్రీధర్, బిర్ల శంకర్, కరుణాకర్, సటికే రాజు, ఆకుల శంకర్, పల్లే వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ అహింస అనే ఆయుధంతో భారతావనికి స్వాతంత్ర్యన్ని సిద్దింప చేసిన మహమనిషి మహాత్మగాంధీ అని, గ్రామ స్వరాజ్యమే దేశానికి వెన్నుముక అని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి మహాత్మ గాంధి అని కొనియాడారు. మహాత్ముని అడుగు జాడల్లో నడవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. బాపూజీ కలలు కన్న స్వరాజ్య స్థాపనకు పిలుపునిచ్చారు
.
