Type Here to Get Search Results !

పాపన్నపేటలో గణేష్ మండపం వద్ద ఘనంగా అన్నదానం.. కార్యక్రమాన్ని నిర్వహించిన సీనియర్ జర్నలిస్ట్ బాలకిషన్

 


ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

అన్నదానం నిర్వహించిన సీనియర్ జర్నలిస్ట్ బాలకిషన్

పాపన్నపేట, సెప్టెంబర్ 20 (తెలుగు ట్రెండ్స్):
పాపన్నపేట మండల కేంద్రంలోని కుమ్మరి గైన్ సమీపంలో ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రభ సీనియర్ జర్నలిస్ట్ వంజరి బాలకిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అన్నదాన కార్యక్రమానికి ముందు ఉదయాన్నే గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజారి ఆధ్వర్యంలో మంత్రోచ్ఛారణల మధ్య గణపతికి పూజా కార్యక్రమాలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం భక్తులు, స్థానిక ప్రజలకు అన్నదానం చేశారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా అన్నదానం నిర్వహించడం ద్వారా భక్తి భావంతో పాటు సేవా స్ఫూర్తిని చాటారని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ యూత్ సభ్యులు ప్రవీణ్ కుమార్, సాయి కుమార్, బాగేష్, మల్లేశం, కుమార్, దుర్గేష్, రమేష్, మల్లేష్ తదితరులు పాల్గొని అన్నదాన కార్యక్రమం విజయవంతం చేయడంలో సహకరించారు. N

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language