నార్సింగి మాజీ సర్పంచ్ కిష్టయ్య మృతి పార్టీకి తీరని లోటు
మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి.. అంత్యక్రియల్లో పాల్గొని కుటుంబ సభ్యులకు పరామర్శ
తెలుగు ట్రెండ్స్, పాపన్నపేట, అక్టోబర్ 16:
పాపన్నపేట మండలం నార్సింగి గ్రామ మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు నీలగిరి కిష్టయ్య మృతి పార్టీకి తీరని లోటని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కిష్టయ్య అంత్యక్రియల్లో పాల్గొన్న ఆమె, ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
కిష్టయ్య మృతి విషయం తెలుసుకున్న పద్మా దేవేందర్‌రెడ్డి నార్సింగి గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కిష్టయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో పాపన్నపేట మండల మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుమ్మరి జగన్, సర్పంచులు మల్లేశం, సాయిరెడ్డి, మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కుబేరుడు, నాయకులు దుర్గయ్య, బాబాగౌడ్, గోపాల్, అనిల్‌రెడ్డి, బద్రి మల్లేశం, ఏడుపాయల శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్, వెంకట్ రాములు, దండోల్ల సామెల్, నర్సింలు, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
— తెలుగు ట్రెండ్స్

