తెలుగు ట్రెండ్స్, మెదక్, అక్టోబర్ 16:
మెదక్ పట్టణంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పూల పండుగలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మల చుట్టూ ఆడిపాడుతూ సందడి చేశారు.
ఈ వేడుకలకు తెలంగాణ జాగృతి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రజితక్క, ఉమ్మడి మెదక్ జిల్లా మహిళా కన్వీనర్ రాజేశ్వరి అక్క ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు మహిళలతో కలిసి బతుకమ్మ ఆటపాటల్లో పాల్గొని ఉత్సాహాన్ని నింపారు. అనంతరం మహిళలు అందంగా అలంకరించి తీసుకొచ్చిన బతుకమ్మల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి ఐదుగురు మహిళలకు ప్రత్యేక బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి బట్టి అజయ్, పార్టీ సీనియర్ నాయకుడు ఇప్ప రమేష్, విద్యార్థి విభాగం నాయకుడు ఎండీ జునైద్ పాల్గొన్నారు. అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు కరాటే ప్రేమ్, గుట్టకిందిపల్లి రాజశేఖర్, చౌదరి భాను, చౌదరి నవీన్, అల్తాఫ్, అయ్యాన్, జంగం నాగరాజు, వేపూరి శ్రీనివాస్, కంచి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సాగిన ఈ బతుకమ్మ సంబరాలు మెదక్ పట్టణంలో పండుగ వాతావరణాన్ని నెలకొల్పాయి. మహిళల ఉత్సాహం, ఆటపాటలతో కార్యక్రమం సందడిగా సాగింది.
— తెలుగు ట్రెండ్స్
