నర్సాపూర్‌లో రేపు బీజేపీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు
నర్సాపూర్, అక్టోబర్ 1 (తెలుగు ట్రెండ్స్): బీజేవైఎం మెదక్ జిల్లా ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా అక్టోబర్ 2న ఉదయం 10 గంటలకు నర్సాపూర్ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధామల్లేష్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, జిల్లా పదాధికారులు, సీనియర్ నాయకులు, వివిధ మోర్చాల జిల్లా అధ్యక్షులు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, అన్ని మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని ఆయన కోరా
రు.
