Type Here to Get Search Results !

గల్లీ గల్లీలో కుక్కల గుంపులు.. వెల్దుర్తిలో ప్రజల బెంబేలు!

 గల్లీ గల్లీలో కుక్కల గుంపులు.. వెల్దుర్తిలో ప్రజల బెంబేలు!


రాత్రయితే రోడ్డెక్కాలంటే భయం.. పాఠశాల ఆవరణలోనూ కుక్కల సంచారం

వెల్దుర్తి మండలం, అక్టోబర్ 1 (తెలుగు ట్రెండ్స్): వెల్దుర్తి మండల కేంద్రంలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారులు, కాలనీలు, గల్లీల్లో పదుల సంఖ్యలో కుక్కలు గుంపులుగా సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు రావడానికి జంకుతున్న పరిస్థితి నెలకొంది. చీకటి పడిన తర్వాత కుక్కల గుంపులు రోడ్లపైకి రావడంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. బైక్‌లపై వెళ్లే వారిని కుక్కలు వెంబడిస్తుండటంతో వాహనదారులు అదుపుతప్పి కిందపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్కలను తప్పించుకునే క్రమంలో వాహనాలను అకస్మాత్తుగా మళ్లించడం, బ్రేకులు వేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా వెల్దుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలోనూ కుక్కలు గుంపులుగా సంచరిస్తుండటంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు పాఠశాల గ్రౌండ్‌లో భోజనం చేస్తున్న సమయంలో కుక్కలు అటువైపు రావడంతో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆహారం కోసం కుక్కలు విద్యార్థుల వద్దకు రావడం, గుంపులుగా తిరగడం వల్ల పిల్లలు భయపడుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ఆవరణలోనే ఇలాంటి పరిస్థితి నెలకొనడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల సంఖ్యను నియంత్రించడంతో పాటు ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, పాదచారులు, వాహనదారులకు భద్రత కల్పించేలా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. సమస్య మరింత తీవ్రరూపం దాల్చకముందే అధికారులు స్పందించి వీధి కుక్కల బెడదను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేస్తున్నా




రు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language