గౌతోజిగూడలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం
మనోహరబాద్, తెలుగు ట్రెండ్స్ :-
మనోహరబాద్ మండలం గౌతోజిగూడ గ్రామ సర్పంచ్ పర్షబోయిన నాగరాజ్, పాలకవర్గం, ఐటీసీ సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం లో భాగంగా గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన వీధులు, పరిసర ప్రాంతాలను శుభ్రం చేసి, చెత్తాచెదారాన్ని తొలగించారు.గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి పారిశుధ్యాన్ని కాపాడాలని గ్రామస్థులకు సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ప్రజలు ఆరోగ్యంగా ఉండటంతో పాటు గ్రామం సుందరంగా మారుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎర్ర నాగరాజ్, గ్రామ పాలకవర్గం సభ్యులు, ఐటీసీ ప్రతినిధులు, సిబ్బంది, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
