Type Here to Get Search Results !

ఏడుపాయల వనదుర్గామాతను దర్శించుకున్న రంగంపేట పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి

 ఏడుపాయల వన దుర్గామాతను దర్శించుకున్న శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామీ 

పాపన్నపేట,అక్టోబర్19: (తెలుగు ట్రెండ్స్ )

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వనదుర్గామాత అమ్మవారిని సోమవారం రోజు రంగంపేట పీఠాధిపతి 

శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

మహిషాసుర మర్దిని అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చింది. అర్చకులు ఉదయాన్నే అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి అనంతరం మహిషాసుర మర్దిని అవతారంగా భక్తులకు దర్శనమించారు.దేవి శరన్నవ రాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ ఏడుపాయల వన దుర్గా మాతను స్వామి దర్శించుకున్నారు, ఆలయం చేరుకున్న స్వామివారికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం స్వామివారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారు మాట్లాడుతూ, భగవంతుని నిత్యం పూజించడంతో పాటు నిత్యం అమ్మవారిని కూడా పూజించడం వల్ల సకల శుభాలు సిద్ధిస్తాయని అలాగే మంచి సత్ప్రవర్తన అవలంబించుకుంటా రన్నారు.శరన్నవరాత్రి ఉత్సవాలలో వివిధ రూపాలలో అమ్మవారు ఉంటారనీ, ప్రతినిత్యం అమ్మవారిని దర్శించుకోవడం భక్తిశ్రద్ధలతో పూజించడం మనం చేసుకున్న పుణ్యఫలం ఆన్నారు. 

ఎంతో మహిమ గల ఈ ప్రదేశంలో ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరగడంతో పాటు మనం దర్శించుకోవడం మన భాగ్యమని కొనియాడారు. అమ్మవారి కృప అందరిపై ఉండాలని సుఖసంతోషాలతో జీవనశైలి మార్చుకోవాలని కోరారు.ఈకార్యక్రమంలో ఆలయ అర్చకులు శంకర్ శర్మ, పార్థివ, రాముశర్మ, రాజశేఖర్ శర్మ,రాజేష్ శర్మ సదాశివశర్మ,మురళీ శర్మ,పవన్ శర్మ ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, ప్రతాపరెడ్డి,పల్లె సాయిబాబా, పార్షా  నర్సింలు గుప్త, తదితరులు పాల్గొన్నారు.



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

MY HEALTH PHARMACY MEDAK

ప్రకటన
My Health Pharmacy Medak

#codes

Hollywood Movies

🌐 Select Language