Type Here to Get Search Results !

ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ ప్రశాంత్‌కు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఘన సత్కారం

 


ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన గిరిజన విద్యార్థి ప్రశాంత్‌కు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఘన సత్కారం

నిరుపేద కుటుంబం నుంచి జాతీయ స్థాయిలో ప్రతిభ.. సోమక్కపేట విద్యార్థికి అభినందనలు

తెలుగు ట్రెండ్స్, చిలిపిచెడ్, అక్టోబర్ 18:

మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం సోమక్కపేట గ్రామపంచాయతీ పరిధిలోని రహీంగూడ తండాకు చెందిన గిరిజన విద్యార్థి జారప్ల ప్రశాంత్ జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్ ఇంజనీరింగ్‌లో గోల్డ్ మెడలిస్ట్‌గా నిలిచిన ప్రశాంత్, పీజీ, పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి ఆయనను ఘనంగా సత్కరించి అభినందించారు.

వ్యవసాయ ఆధారిత నిరుపేద కుటుంబానికి చెందిన ప్రశాంత్, ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ ఉన్నత విద్యను అభ్యసించి జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంక్ సాధించడం విశేషం. ఆయన తండ్రి సుదర్శన్. గిరిజన కుటుంబం నుంచి వచ్చి విద్యారంగంలో ఈ ఘనత సాధించడంతో పలువురు ప్రశాంత్‌ను అభినందిస్తున్నారు.

ఈ సందర్భంగా చిట్కుల్ గ్రామ శివారులోని శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ప్రశాంత్‌కు శాలువా కప్పి, జ్ఞాపిక అందజేసి ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేద గిరిజన కుటుంబం నుంచి వచ్చి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించడం గర్వకారణమని అన్నారు. ప్రశాంత్ సాధించిన విజయం యువతకు స్ఫూర్తిదాయకమని, ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులు మండలానికే కాకుండా రాష్ట్రానికి గర్వకారణమని కొనియాడారు. ప్రశాంత్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అశోక్ రెడ్డి, వైస్ చైర్మన్ లక్ష్మణ్, శ్రీకాంత్ రెడ్డి, గోపాల్ రెడ్డి, అనిల్, దుర్గారెడ్డి, ధర్మారెడ్డి, ఎండీ షాపియోద్దీన్, విష్ణువర్ధన్ రెడ్డి, ముకుందరెడ్డి, రాజిరెడ్డి, కిషన్ రెడ్డి, సుధాకర్, శంకరయ్య, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

MY HEALTH PHARMACY MEDAK

ప్రకటన
My Health Pharmacy Medak

#codes

Hollywood Movies

🌐 Select Language