అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష
కొల్చారం, అక్టోబర్ 5 (తెలుగు ట్రెండ్స్): కొల్చారం మండల కేంద్రంలోని ఎంపీడీవో రఫిక్ ఉన్నిసా కార్యాలయంలో సోమవారం మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండలంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, గ్రామాల్లో నెలకొన్న సమస్యలు తదితర అంశాలపై సమీక్షించారు. గ్రామపంచాయతీల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రజలకు సక్రమంగా అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఆయా శాఖల పరిధిలో చేపడుతున్న కార్యక్రమాల పురోగతిపై అధికారులు వివరాలు అందించారు. మండల అభివృద్ధికి సంబంధించిన పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. సమావేశంలో మండల ఎమ్మార్వో శ్రీనివాస్ చారి, ఏఈఓ ప్రశాంత్, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, సిబ్బంది, గ్రామ కార్యదర్శులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

