Type Here to Get Search Results !

వ్యవసాయానికి కోతలు లేకుండా విద్యుత్‌ సరఫరా చేయాలి: అందోలు బీఆర్‌ఎస్‌ నాయకుల డిమాండ్

 *వ్యవసాయానికి కోతలు లేకుండా కరెంటు సరఫరా చేయండి*

*అందోలు బీఆర్ఎస్ నాయకుల డిమాండ్ 

*తెలుగు ట్రెండ్స్, అందోలు*

ఒకపక్క వర్ష బావ పరిస్థితులు..మరోపక్క కరెంటు కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అందోలు బీఆర్ఎస్ నాయకులు చాపల వెంకటేశం, సార శ్రీధర్, కుమ్మరి క్రిష్ణ, ఖాజా పాష అన్నారు. గురువారం వారు జోగిపేట పట్టణంలో మాట్లాడుతూ అప్రకటిత విద్యుత్ కోతలతో అందోలు నియోజకవర్గంలోని ఆన్ని మండలాల రైతులు నానా గోస పడుతున్నారని, కాలం తెచ్చిన కరువు కంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువే ఎక్కువ అవుతుందన్నారు. సరైన సమయానికి వర్షాలు పడక చేతికి వస్తున్న పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంటే కరెంటు కోతలతో రైతులు మరింత ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. ఆరుగాలం శ్రమించి, అప్పులు చేసి పంటలు పండిస్తే సమయానికి కరెంటు లేక పంటలకు నీరందక వ్యవసాయదారులు దిక్కు తోచని స్థితిలో బిక్కు బిక్కుమంటూ కరెంటు కొసం ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతుల గోస అర్థం చేసుకొని, వ్యవసాయానికి సరిపడ కోతలు లేని కరెంటు సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language