*జిల్లాలో నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్..*
*సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్,
*తెలుగు ట్రెండ్స్, అందోలు ప్రతినిధి:*
శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈ నెల మొత్తం అంటే అక్టోబర్1వ తేదీ నుండి 31వ తేదీ వరకు 30, 30(ఎ) పోలీసు యాక్ట్–1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు.
కాబట్టి సంగారెడ్డి జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఆయన స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రజాధనానికి నష్టం కలిగించే ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేపట్టకూడదని హెచ్చరించారు. ఈ విషయంలో జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించవలసిందిగా ఎస్పీ సూచించారు. నిబంధనలు పాటించాని వారి చర్యలు తప్పవన్నారు.
