వాల్మీకి బోయ సంఘం మండల అధ్యక్షుడిగా కె. గట్టయ్య ఏకగ్రీవ ఎన్నిక
సంఘం అభివృద్ధికి కృషి చేస్తా.. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తా: గట్టయ్య
రామాయంపేట, అక్టోబర్ 11 (తెలుగు ట్రెండ్స్):
మెదక్ జిల్లా రామాయంపేట మండల వాల్మీకి బోయ సంఘం అధ్యక్షుడిగా వెంకటాపూర్ గ్రామానికి చెందిన కె. గట్టయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల అధ్యక్షుడిగా గట్టయ్య ఎన్నిక కావడంతో సంఘం నాయకులు, సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన నాయకత్వంలో సంఘం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షుడు కె. గట్టయ్య మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి మండల అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన వాల్మీకి బోయ సంఘం నాయకులకు, సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సంఘం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని పేర్కొన్నారు.
సంఘం బలోపేతానికి, సభ్యుల ఐక్యతకు ప్రాధాన్యతనిస్తూ అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని తెలిపారు. సంఘం అభివృద్ధి కోసం నాయకులు, సభ్యుల సహకారంతో పనిచేస్తానని చెప్పారు. తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సుతారి శ్రీనివాస్, నర్సింలు, బాపు రాజు తదితరులు పాల్గొన్నారు.
