Type Here to Get Search Results !

నర్సాపూర్‌లో హోటళ్లపై తనిఖీలు చేపట్టాలి.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదు: సీపీఎం

 


నర్సాపూర్‌లో హోటళ్లపై తనిఖీలు చేపట్టాలి

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదు: సీపీఎం డివిజన్ కార్యదర్శి కడారి నాగరాజు

తెలుగు ట్రెండ్స్, నర్సాపూర్, అక్టోబర్ 16:

నర్సాపూర్ పట్టణంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో ఆహార నాణ్యతపై అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించాలని సీపీఎం నర్సాపూర్ డివిజన్ కార్యదర్శి కడారి నాగరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కడారి నాగరాజు మాట్లాడుతూ, నాణ్యత లేని ఆహార పదార్థాల విక్రయాల వల్ల ప్రజలు, కార్మికులు, విద్యార్థుల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మూడు రోజుల క్రితం మండీ హోటల్‌లో ఆహారం తిన్న తర్వాత ఒకరు మృతి చెందగా, మరో 30 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. అలాగే గురువారం సిటీ ప్యాలెస్‌లోని సమోసాలో గుట్కా లాంటి పదార్థం కనిపించిందన్న విషయం ఆందోళన కలిగిస్తోందన్నారు.

హోటళ్లు, ఆహార విక్రయ కేంద్రాల్లో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం డివిజన్ కమిటీ సభ్యుడు దాసు పాల్గొన్నారు.

— తెలుగు ట్రెండ్స్

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language