Type Here to Get Search Results !

మోదీ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన బీజేపీ నాయకులు

 మోదీ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన బీజేపీ నాయకులు


మెదక్, అక్టోబర్ 6 (తెలుగు ట్రెండ్స్): ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ చేపట్టిన సేవా సంకల్ప్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ నాయకులు మొక్కలు నాటారు. మెదక్ జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు బైండ్ల సత్యనారాయణ ముదిరాజ్ ఆధ్వర్యంలో రామాయంపేట–సిద్దిపేట జాతీయ రహదారి వెంట మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. గవర్నర్ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని జాతీయ రహదారి వెంట మొక్కలు నాటినట్లు నాయకులు తెలిపారు.


ఈ సందర్భంగా బైండ్ల సత్యనారాయణ ముదిరాజ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటడం శుభపరిణామమని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, దేశానికి మరింత కాలం సేవలు అందించాలని ఆకాంక్షించారు.


ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం కాశీనాథ్, ఓబీసీ మోర్చా కార్యదర్శి చింతల శేఖర్, వాణిజ్య సెల్ కన్వీనర్ బజ్జూరి బిక్షపతి తదితరులు పాల్గొన్నా



రు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language