Type Here to Get Search Results !

ముదిరాజులను బీసీ-ఏలోకి మార్చాలి: చొప్పరి శంకర్

 ముదిరాజులను బీసీ-ఏలోకి మార్చాలి: చొప్పరి శంకర్


నర్సాపూర్, అక్టోబర్ 6 (తెలుగు ట్రెండ్స్): ముదిరాజులను ప్రస్తుతం ఉన్న బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలని డిమాండ్ చేస్తూ నర్సాపూర్‌లో ముదిరాజులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నర్సాపూర్ నియోజకవర్గ ముదిరాజ్ అధ్యక్షుడు మన్నే దిగంబర్ రావు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ‘మన ముదిరాజ్ మహాసభ’ రాష్ట్ర అధ్యక్షుడు చొప్పరి శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


ఈ సందర్భంగా చొప్పరి శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముదిరాజులు అధిక జనాభా కలిగిన కులాల్లో ఒకరైనప్పటికీ రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముదిరాజ్ యువత చైతన్యవంతమై తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ‘‘ముదిరాజ్ బిడ్డలు ఓటును అమ్ముకోవద్దు.. నమ్ముకోవాలి. పిలిస్తే కాదు.. విషయం తెలిస్తే ముందుండి రావాలి’’ అని అన్నారు.


తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలని చొప్పరి శంకర్ డిమాండ్ చేశారు. బీసీ-ఏలోకి మార్చినప్పుడే ముదిరాజులకు సామాజిక న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ డిమాండ్‌పై స్పందించకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో ఉద్యమం చేపడతామని ఆయన తెలిపారు.


నర్సాపూర్ నియోజకవర్గ ముదిరాజ్ అధ్యక్షుడు మన్నే దిగంబర్ మాట్లాడుతూ ముదిరాజుల హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని కోరారు. నర్సాపూర్ మండలంలోని వివిధ గ్రామాల నుంచి ముదిరాజ్ కుల బాంధవులు పెద్ద సంఖ్యలో సమ్మేళనానికి హాజరై తమ ఐక్యతను చాటారు.


ఈ కార్యక్రమంలో ఓయూ జేఏసీ అధ్యక్షుడు నిజ్జన రమేష్ ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షుడు బల్ల సత్తయ్య, ఓయూ జేఏసీ నాయకులు అల్లుడు జగన్ ముదిరాజ్, తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సైలేంద్ర శివయ్య, ఐఐసీ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి ప్రభాకర్, రాష్ట్ర నాయకులు ఈటల భద్రయ్య, తెలంగాణ రాజ్యాధికారి పార్టీ జిల్లా అధ్యక్షుడు, అల్లిపూర్ సర్పంచ్ కుమార్ ముదిరాజ్, కళాకారులు నగేష్, బుల్లెట్ వెంకన్న, రామాయంపేట అశ్విని ముదిరాజ్, జై ముదిరాజ్ మీడియా నాయకులు గంగాధర్, యువజన సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొ




న్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language