Type Here to Get Search Results !

ఔషధ తయారీలో ఫార్మసిస్టుల పాత్ర కీలకం: విష్ణు రాజు

 ఔషధ తయారీలో ఫార్మసిస్టుల పాత్ర కీలకం


విష్ణు విద్యా సంస్థల చైర్మన్ కె. విష్ణు రాజు

నర్సాపూర్, అక్టోబర్ 5 (తెలుగు ట్రెండ్స్): ఔషధాల తయారీలో ఫార్మసిస్టుల పాత్ర ఎంతో కీలకమని విష్ణు విద్యా సంస్థల చైర్మన్ కె. విష్ణు రాజు అన్నారు. నర్సాపూర్‌లోని విష్ణు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (వైఫర్) కళాశాలలో సోమవారం నూతన విద్యార్థుల పరిచయ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విష్ణు విద్యా సంస్థల చైర్మన్ కె. విష్ణు రాజు, వైస్ చైర్మన్ డా. రవిచంద్రన్ రాజగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కె. విష్ణు రాజు మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఫార్మసీ రంగానికి ఎంతో ప్రాధాన్యత పెరిగిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఫార్మా శాస్త్రవేత్తలు అనేక రకాల ప్రాణాలను కాపాడే ఔషధాలను అభివృద్ధి చేస్తున్నారని, అందులో ఫార్మసిస్టుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ తయారీలోనూ ఫార్మసీ రంగానికి చెందిన నిపుణుల కృషి ఎంతో ఉందన్నారు. విద్యార్థులు ఫార్మసీ రంగంలో వస్తున్న నూతన మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లో అనేక ఫార్మా పరిశ్రమలు ఉన్నందున విద్యార్థులు వాటిని సందర్శించి పరిశ్రమల్లో ఔషధాల తయారీ, పరిశోధన విధానాలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని వెంటనే నమ్మకుండా, దాని వాస్తవాలను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నమ్మాలని సూచించారు. విద్యార్థులు పుస్తక పఠనానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. వైస్ చైర్మన్ డా. రవిచంద్రన్ రాజగోపాల్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీకి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. కళాశాలలో జపనీస్ భాషతో పాటు వివిధ విదేశీ కోర్సులను కూడా బోధిస్తున్నట్లు తెలిపారు. ఫార్మసీ విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యార్థులతో కలిసి ప్రయోగాలు నిర్వహిస్తూ నూతన ఆవిష్కరణలకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. ఏ. రమేష్, వివిధ విభాగాల హెచ్‌ఓడీలు, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నా




రు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language