పరికిబండలో కుటుంబానికి రూ.57 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
మనోహరాబాద్ మండలం, అక్టోబర్ 6 (తెలుగు ట్రెండ్స్): నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి సహకారంతో మనోహరాబాద్ మండలంలోని పరికిబండ గ్రామానికి చెందిన మన్నే స్వరూప భర్త సత్తయ్య కుటుంబానికి మంజూరైన రూ.57 వేల ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కును అందజేశారు. కాంగ్రెస్ యువజన నాయకుడు మంచ శ్రీరామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందుతున్న ఆర్థికసాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ పథకాల ద్వారా అవసరమైన సహాయం అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరుకు సహకరించిన నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డికి లబ్ధిదారుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆరో వార్డు సభ్యులు గాంతి అశోక్, నాయకులు గాంతి ఆంజనేయులు, పిట్ల కృష్ణ, మంచ కుమార్, రవి, డప్పు లక్ష్మణ్, అంబదాస్ రమేష్, బి.బుచ్చయ్య, మైబుబ్, బి.రమేష్, టి.శ్రీశైలం, కే.గణేష్, జి.శ్రీశైలం, బి.శ్రీకాంత్, పి.నవీన్, ఎస్.వినోద్, ఎన్.స్వామి, లబ్ధిదారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నా
రు.
