Type Here to Get Search Results !

మెదక్‌లో విద్యుత్ డిమాండ్ డబుల్: ఎస్‌ఈ నారాయణ నాయక్

 


మెదక్ జిల్లాలో రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్

రికార్డు డిమాండ్‌కు దీటుగా విద్యుత్ సరఫరా: ఎస్‌ఈ నారాయణ నాయక్

మెదక్, అక్టోబర్ 10 (తెలుగు ట్రెండ్స్):

మెదక్ జిల్లాలో రోజురోజుకూ విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతున్నప్పటికీ, అందుకు దీటుగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ నారాయణ నాయక్ తెలిపారు. విద్యుత్ అంతరాయాలపై వివిధ పత్రికల్లో వస్తున్న కథనాలపై ఆయన శనివారం ప్రకటన విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం, పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరుగుతోందన్నారు. మెదక్ జిల్లాలో గత ఏడాది అక్టోబర్‌లో 282 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదుకాగా, ఈ ఏడాది అక్టోబర్‌లో 567 మెగావాట్లకు చేరిందని వివరించారు. గత మార్చి నెలలో వేసవి డిమాండ్ 506 మెగావాట్లను దాటిందని పేర్కొన్నారు.

వ్యవసాయ, గృహ అవసరాల కారణంగా విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నప్పటికీ, ముందస్తు ప్రణాళికతో సరఫరా వ్యవస్థను బలోపేతం చేసి పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని తెలిపారు. విద్యుత్ కోతలు, సరఫరా అంతరాయాలు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.

సబ్‌స్టేషన్ల వద్ద వోల్టేజీ సమస్యలను పరిష్కరించేందుకు హైదరాబాద్ నుంచి 17, 2 ఎంవీఏఆర్ కెపాసిటర్ బ్యాంకులను యుద్ధప్రాతిపదికన తరలించి ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రామాయంపేట, దొంగల ధర్మారం, కుచన్‌పల్లి సబ్‌స్టేషన్లలో పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచి ఓవర్‌లోడ్ సమస్యను అధిగమించామని తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో అదనపు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

జిల్లావ్యాప్తంగా గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అంతరాయం లేకుండా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని నారాయణ నాయక్ పేర్కొన్నారు. పొట్ట దశలో ఉన్న వరి పంటతోపాటు ఇతర పంటలు ఎండిపోకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language