Type Here to Get Search Results !

శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన ఏడుపాయల గోకుల్ షెడ్

 




శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన ఏడుపాయల గోకుల్ షెడ్

పాపన్నపేట, అక్టోబర్ 10 (తెలుగు ట్రెండ్స్):

తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన మెదక్ జిల్లా ఏడుపాయల శ్రీ వనదుర్గామాత ఆలయంలో శనివారం నుంచి ప్రారంభం కానున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు గోకుల్ షెడ్‌లోని అమ్మవారి ఉత్సవ మండపాన్ని అందంగా ముస్తాబు చేశారు.

నవరాత్రి ఉత్సవాల ప్రారంభానికి ముందు ఉదయాన్నే అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఉత్సవాలను అంగరంగ వైభవంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, సాయిబాబా, నరేష్, మహేష్, యాదగిరి, దీపక్ రెడ్డి, బలరాం తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language