కొత్త లింగాయిపల్లిలో వైభవంగా శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
పాపన్నపేట, అక్టోబర్ 10 (తెలుగు ట్రెండ్స్):
మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని కొత్త లింగాయిపల్లి గ్రామంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను నేటి నుంచి నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పది రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నట్లు వెల్లడించారు.
ఈ నెల 11న ఆదివారం బాల త్రిపుర సుందరీ దేవిగా, 12న సోమవారం గాయత్రీ దేవిగా, 13న మంగళవారం శ్రీ అన్నపూర్ణ దేవిగా, 14న బుధవారం శ్రీ మహా చండీ దేవిగా, 15న గురువారం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా, 16న శుక్రవారం శ్రీ సరస్వతీ దేవిగా, 17న శనివారం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా, 18న ఆదివారం శ్రీ మహా సరస్వతీ దేవిగా, 19న సోమవారం శ్రీ దుర్గాదేవిగా, 20న మంగళవారం శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవారు అలంకరణల్లో దర్శనమివ్వనున్నట్లు తెలిపారు.
ఈ నెల 16న సంకలీది దేవి పూజ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 21న అమ్మవారి శోభాయాత్ర నిర్వహించి భక్తులకు ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.
ఉత్సవాల్లో భాగంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని నిర్వాహకులు కోరారు.
