శ్రీ వనదుర్గ భవానీ మాతను దర్శించుకున్న చిలుముల సుహాసిని రెడ్డి
కొల్చారం, అక్టోబర్ 17 (తెలుగు ట్రెండ్స్):
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ వనదుర్గ భవానీ మాత ఆలయంలో మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
వేద పండితులు వేద మంత్రోచ్ఛారణల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి చిలుముల సుహాసిని రెడ్డికి ఆశీర్వచనాలు అందజేశారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్న ఆమె, అమ్మవారి కృపాకటాక్షాలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి భక్తులు తరలివస్తుండటంతో ఆలయంలో భక్తి భావం వెల్లివిరిసింది.
