Type Here to Get Search Results !

లక్ష్మాపూర్ గ్రామసభలో విద్యుత్ సమస్యపై రైతుల నిలదీత

 


లోఓల్టేజీతో మోటార్లు కాలిపోతున్నాయ్.. రైతుల ఆవేదన

లక్ష్మాపూర్: విద్యుత్ కోతలు, లోఓల్టేజీ కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం లక్ష్మాపూర్ గ్రామంలో సర్పంచ్ నవీన్‌గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో విద్యుత్ సమస్య ప్రధానంగా చర్చకు వచ్చింది.

వ్యవసాయానికి అవసరమైన సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పంటలకు సకాలంలో నీరందించలేకపోతున్నామని రైతులు తెలిపారు. విద్యుత్ సరఫరా ఉన్న సమయంలోనూ లోఓల్టేజీ కారణంగా మోటార్లు, స్టార్టర్లు తరచూ కాలిపోతున్నాయని, వాటి మరమ్మతులకు అదనపు ఖర్చులు భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికే సాగు పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో విద్యుత్ సమస్యలు తమపై మరింత ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని రైతులు పేర్కొన్నారు. వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా నిరంతరాయంగా, తగిన వోల్టేజీతో విద్యుత్ సరఫరా చేయాలని కోరారు.

అదేవిధంగా గ్రామంలోని సీసీ రోడ్లు, మురుగు కాలువల సమస్యలను కూడా గ్రామస్థులు గ్రామసభ దృష్టికి తీసుకువచ్చారు. ఆయా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని సర్పంచ్ నవీన్‌గౌడ్ హామీ ఇచ్చారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language