Type Here to Get Search Results !

లైసెన్స్ లేకుండా హోటల్ నిర్వహణ.. ఆద్య గ్రాండ్‌కు ఫుడ్ సేఫ్టీ అధికారుల నోటీసులు

 


నోటీసులు ఇచ్చినా తీరు మారదా..?

ఆద్య గ్రాండ్ హోటల్‌కు ఫుడ్ సేఫ్టీ అధికారుల నోటీసులు
లైసెన్స్ లేకుంటే ఎలా నడుపుతున్నారు?

రామాయంపేట: ఆహార భద్రత నిబంధనలు పాటించకుండా హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు నిర్వహిస్తున్న వారిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని జాతీయ రహదారిపై ఉన్న ఆద్య గ్రాండ్ హోటల్‌లో మంగళవారం అధికారులు తనిఖీలు నిర్వహించారు.

తనిఖీల్లో హోటల్‌కు సంబంధించిన ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ వివరాలను అధికారులు పరిశీలించగా, అవసరమైన లైసెన్స్ లేదని గుర్తించినట్లు మెదక్ ఫుడ్ సేఫ్టీ అధికారి సందీప్ కుమార్ తెలిపారు. దీంతో హోటల్‌ను మూసివేయాలని నిర్వాహకులకు నోటీసులు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ఆహార వ్యాపారాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారి సూచించారు. సరైన లైసెన్స్ లేకుండా హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు.

ఆహార భద్రత ప్రమాణాలను ఉల్లంఘించే హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లపై ఇకపై తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామని సందీప్ కుమార్ హెచ్చరించారు. నిబంధనలు పాటించకుండా ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందేలా అధికారులు తనిఖీలు కొనసాగిస్తారని తెలిపారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language