పాపన్నపేటలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
పాపన్నపేట, అక్టోబర్ 2 (తెలుగు ట్రెండ్స్): పాపన్నపేట మండల కేంద్రం శివారులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. టెక్మాల్ మండలం కాదులూరుకు చెందిన మొల్ల దస్తగిరి (23), మారిగారి బాబు (23) బైక్పై మెదక్ నుంచి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా అయ్యప్ప స్వామి ఆలయం వద్ద ఎదురుగా వచ్చిన జేసీబీ వారి బైక్ను ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. దస్తగిరి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తుక్కయ్య తెలిపారు
.
