Type Here to Get Search Results !

గాంధీజీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రికి బీజేపీ నాయకుల ఘన నివాళులు

 గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రికి బీజేపీ నాయకుల ఘన నివాళులు


మెదక్ పట్టణంలో జయంతి కార్యక్రమాలు నిర్వహించిన బీజేపీ నాయకులు

మెదక్, అక్టోబర్‌ 2 (తెలుగు ట్రెండ్స్): మహాత్మా గాంధీజీ, మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా మెదక్ పట్టణంలో బీజేపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తొలుత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం లాల్‌ బహదూర్‌ శాస్త్రి చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను స్మరించుకోవాలని, లాల్‌ బహదూర్‌ శాస్త్రి దేశానికి అందించిన సేవలు, సరళమైన జీవన విధానం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. జాతి నిర్మాణంలో ఇద్దరు మహనీయులు అందించిన సేవలను స్మరించుకుంటూ వారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, జిల్లా నాయకులు కలికి నాగరాజ్, లోకపోయిన లోకేష్, బజ్జూరి బిక్షపతి, 21వ వార్డు కౌన్సిలర్‌ అబ్బా రాజమణి, లక్ష్మణ్‌, అల్లం మధు, బెండల స్వామి, అంకం శ్రీను, నల్లాల విజయ్‌, ఐతారం సంగీత, గంగ, సౌజన్య తదితరులు పాల్గొన్నా



రు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language