Type Here to Get Search Results !

చిట్కుల్ చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి

 


చిట్కుల్ చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి

పూర్ణకుంభంతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన ఆలయ ప్రధాన పూజారి

చిలిపిచెడ్, అక్టోబర్ 18 (తెలుగు ట్రెండ్ న్యూస్):

మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం చిట్కుల్ గ్రామ శివారులోని శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి శనివారం శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డికి ఆలయ ప్రధాన పూజారి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అశోక్ రెడ్డి, వైస్ చైర్మన్ లక్ష్మణ్, శ్రీకాంత్ రెడ్డి, గోపాల్ రెడ్డి, అనిల్, దుర్గారెడ్డి, ధర్మారెడ్డి, ఎండి షాపియోద్దీన్, విష్ణువర్ధన్ రెడ్డి, ముకుందరెడ్డి, రాజిరెడ్డి, కిషన్ రెడ్డి, సుధాకర్, శంకరయ్య, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

MY HEALTH PHARMACY MEDAK

ప్రకటన
My Health Pharmacy Medak

#codes

Hollywood Movies

🌐 Select Language