Type Here to Get Search Results !

ఏడుపాయల్లో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం.. బాల త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిచ్చిన వనదుర్గామాత

 




ఏడుపాయల్లో అంగరంగ వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన అడిషనల్ కలెక్టర్ నగేష్, ఈఓ మఠం వీరేశం

పాపన్నపేట, అక్టోబర్ 11 (తెలుగు ట్రెండ్స్):

తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన మెదక్ జిల్లా ఏడుపాయల శ్రీ వనదుర్గామాత ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ప్రారంభంతో ఆలయ పరిసరాలు భక్తుల సందడితో కళకళలాడాయి.

ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రధాన ఆలయం నుంచి గోకుల్ షెడ్ వరకు బాజాభజంత్రీల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రత్యేక మంటపంలో ప్రతిష్ఠించారు. అనంతరం నవరాత్రుల ప్రధాన అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలిరోజు శ్రీ వనదుర్గామాత బాల త్రిపుర సుందరీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్, ఆలయ ఈఓ మఠం వీరేశం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. నవరాత్రుల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఏడుపాయలకు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

భక్తులకు అన్నప్రసాదం.. పోలీసుల బందోబస్తు

నవరాత్రి ఉత్సవాలకు విచ్చేసిన భక్తుల కోసం ఆలయ పరిసరాల్లో అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పాపన్నపేట ఎస్‌ఐ సారా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లింగంపేట నరేందర్ గౌడ్, మాజీ ఎంపీపీ పి. చందన ప్రశాంత్ రెడ్డి, మాజీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఎల్. మల్లప్ప, అప్పాజీపల్లి సర్పంచ్ గజిని, నాయకులు ముషెట్టి కిష్టయ్యతో పాటు ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, సాయిబాబా, నరేష్, మహేష్, యాదగిరి, దీపక్ రెడ్డి, బలరాం తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language