Type Here to Get Search Results !

యూసుఫ్‌పేట ఈశ్వరాలయంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు.. బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన దుర్గామాత

 



యూసుఫ్‌పేట ఈశ్వరాలయంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన దుర్గామాత

పాపన్నపేట, అక్టోబర్ 11 (తెలుగు ట్రెండ్స్):

మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని యూసుఫ్‌పేట ఈశ్వరాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఉత్సవాల తొలిరోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో దుర్గామాత భక్తులకు దర్శనమిచ్చారు.

ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు రమేష్ శర్మ అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహించడంతో పాటు గణపతి పూజ, కలశ స్థాపన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా చేపట్టారు. దివ్యమైన అలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా, అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజులపాటు అమ్మవారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. భక్తులందరూ ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలు పొందాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language