తూప్రాన్ లో రేపటినుండి నవదుర్గ నవరాత్రి ఉత్సవాలు
*మహంకాళి దేవాలయంలో 28వ వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబు
తెలుగు ట్రెండ్స్, తూప్రాన్ :-
నవదుర్గ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తూప్రాన్ లోని మహంకాళి దేవాలయంలో గత 28 సంవత్సరాలుగా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను వైభవపీతంగా నిర్వహిస్తున్నారు. దుర్గాభవాని సేవా సమితి ఆధ్వర్యంలో ఈనెల 11వ తేదీ ఆదివారం నుండి 21వ తేదీ బుధవారం వరకు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను వైభవ్వేతంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 11వ తేదీ ఆదివారం ఉదయం గోపూజ అఖండ దీపారాధన గణపతి పూజ వేద స్వస్తి పుణ్యావాచనము మహా సంకల్పము పంచగవ్య ప్రాశవ దీక్షా స్వీకరణ ధ్వజారోహణము అమ్మవారికి చతుస్ షష్టి పూజ అంకురార్పణ మంట దేవత ప్రధాన కలశ స్థాపన 12వ తేదీ సోమవారం ఉదయం చతుస్ షష్టి పూజ రాత్రి 7 గంటలకు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం మహా లింగార్చన బిల్వర్చన 13 వ తేదీ మంగళవారం రాత్రి శాకాంబరి అలంకరణ 14వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు సామాజిక సమరసితా కార్యక్రమం రాత్రి 7 గంటలకు గీతా స్కూల్ విద్యార్థులచే సాంస్కృతి కార్యక్రమాలు 15వ తేదీ గురువారం రాత్రి 6 గంటలకు 16వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు లక్ష కుంకుమార్చన కార్యక్రమం రాత్రి 8 గంటలకు మూలా నక్షత్రం పిల్లలచే సరస్వతి మాత పూజ 17వ తేదీ శనివారం రాత్రి 7 గంటలకు ఉమామహేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం 18వ తేదీ ఆదివారం రాత్రి 7 గంటలకు లక్షదీపార్చన కాలిక దుర్గాష్టమి సుహాసిని పూజ నిర్వహిస్తున్నట్లు తెలిపారు మరియు 19వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు మహాబలిదానం మహా పూర్ణాహుతి కార్యక్రమం మహర్నవమి 20వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటలకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఆయుధ పూజ మరియు రాత్రి 7 గంటలకు దుర్గాభవాని యూత్ వారిచే మహంకాళి దేవాలయంలో రావణాసుర దహన కాండ తుపాకులచే మల్లె చెట్టు కాల్చే కార్యక్రమం ప్రతిరోజు ఉదయం రుద్ర స్వాహాకార పూర్వక మహా చండీయాగం మరియు మధ్యాహ్నం ఒంటిగంటకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

