ఫోక్ సాంగ్ ప్రోమోను ప్రారంభించిన ఎమ్మెల్యే
మన
ప్రాంత యువ కళాకారులను ప్రోత్సహించాలి: ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
నర్సాపూర్, అక్టోబర్ 1 (తెలుగు ట్రెండ్స్): సిరిమువ్వలు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు, నర్సాపూర్ ప్రాంతానికి చెందిన నీరుడి శ్రీశైలం రూపొందించిన ‘రాయల్ ఎన్ఫీల్డ్’ ఫోక్ సాంగ్ ప్రోమోను బుధవారం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రారంభించారు. మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీరాజు యాదవ్, వైస్ చైర్మన్ వనముల బుచ్చెష్ యాదవ్ సమక్షంలో ప్రోమోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నర్సాపూర్ ప్రాంతానికి చెందిన శ్రీశైలం తన స్వశక్తితో సొంతంగా పాటలను రూపొందిస్తూ ప్రజలను చైతన్యపరచడం అభినందనీయమని అన్నారు. స్థానిక కళాకారులు, యువ ప్రతిభావంతులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని సూచించారు. కళాకారులను ప్రోత్సహిస్తే మరింత ఉత్సాహంతో సమాజానికి ఉపయోగపడే మంచి పాటలను రూపొందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న ప్రతిభను గుర్తించి వారికి తగిన ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఫోక్ సాంగ్స్ ద్వారా సామాజిక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కూడా మరింతగా ప్రాచుర్యంలోకి తీసుకురావచ్చని తెలిపారు. ఈ సందర్భంగా ఫోక్ సాంగ్ ప్రోమో రూపకర్త నీరుడి శ్రీశైలంను ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు అభినందించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు నరసమ్మ, రవి, సుధీర్ గౌడ్, నిరంజన్ దాస్, శ్రీకాంత్, సునీత, బాల్రెడ్డి, బుల్లెట్ రాజు, సరిత, ఆంజనేయులు గౌడ్, నాయకులు పంబల్ల బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
