Type Here to Get Search Results !

గాంధీ జయంతికి ప్రతి గ్రామంలో శ్రమదానం చేయాలి: ఆంజనేయులు గౌడ్

 ప్రతి గ్రామంలో శ్రమదానం చేయాలి


మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్

నర్సాపూర్, అక్టోబర్ 1 (తెలుగు ట్రెండ్స్): జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని మెదక్ జిల్లాలోని ప్రతి గ్రామంలో శుక్రవారం శ్రమదానం కార్యక్రమాలు నిర్వహించాలని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం నర్సాపూర్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రతి మండల అధ్యక్షుడు, గ్రామ అధ్యక్షుడు, సర్పంచులు సమన్వయంతో తమ పరిధిలోని గ్రామాల్లో శ్రమదానం కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. గ్రామ ప్రజలను పెద్ద సంఖ్యలో భాగస్వాములను చేసి గ్రామాల పరిశుభ్రత, పరిసరాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. మహాత్మా గాంధీజీ చూపిన సత్యం, అహింస, సేవా మార్గాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు. గాంధీజీ సిద్ధాంతాలు, ఆశయాలను నేటి తరానికి చేరువ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. గాంధీ జయంతిని కేవలం వేడుకలకు పరిమితం చేయకుండా సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించాలని కోరారు. గ్రామాల పరిశుభ్రతతో పాటు ప్రజల్లో సామాజిక బాధ్యత, సేవా స్ఫూర్తిని పెంపొందించేలా కార్యక్రమాలను నిర్వహించాలని కాంగ్రెస్ శ్రేణులకు సూచించా


రు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language