Type Here to Get Search Results !

శివంపేట రామాలయ ధ్వజస్తంభానికి రూ.50 వేల విరాళం అందించిన మహేష్ గుప్తా

 


రామాలయ ధ్వజస్తంభ ఏర్పాటుకు రూ.50 వేల విరాళం

శివంపేట, తెలుగు ట్రెండ్స్:

మెదక్ జిల్లా శివంపేట గ్రామంలోని ప్రముఖ పురాతన పుణ్యక్షేత్రమైన రామాలయానికి ధ్వజస్తంభం ఏర్పాటు చేసేందుకు తాజా మాజీ జెడ్పీటీసీ, సంఘసేవకులు పబ్బ మహేష్ గుప్తా రూ.50 వేల విరాళం అందజేశారు. తన సొంత నిధుల నుంచి ఈ మొత్తాన్ని ఆలయ పూజారి శాస్త్రుల రాజశేఖర్ శర్మకు అందించారు.

ఈ సందర్భంగా మహేష్ గుప్తా మాట్లాడుతూ ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన రోజున ఆలయానికి వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తానని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజపేట వెంకటేశ్వర్, ఉప సర్పంచ్ ఇసుగారి మల్లేశ్, వార్డు సభ్యులు ముయడ్డి ముత్యాలు, కొవ్వూరి యాదగిరి, గ్రామ శాఖ అధ్యక్షుడు ముద్దగాళ్ల లక్ష్మీనరసయ్య, మాజీ సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్, మాజీ వార్డు సభ్యుడు బాసంపల్లి పోచగౌడ్, మగ్దుంపూర్ సర్పంచ్ సోము అశోక్, పీఎంజీ యువసేన సభ్యులు కొత్తపేట శ్రీనివాస్ గౌడ్, సోముసాని రేవంత్, పత్రాల త్రినేష్ గౌడ్, కల్లూరి రాజు, బాలాపురం సురేష్, సాదక్, క్యాసని వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language