Type Here to Get Search Results !

కాళ్లకల్‌లో పంచాయతీ కార్మికులకు పండుగ కానుకగా బట్టల పంపిణీ

 


పంచాయతీ కార్మికులకు పండుగ కానుకగా బట్టల పంపిణీ

తెలుగు ట్రెండ్స్, మనోహరాబాద్:

మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామ పంచాయతీ కార్మికులకు బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా గ్రామ మాజీ ఇన్‌చార్జి సర్పంచ్ కాళిదాసు, 13వ వార్డు సభ్యురాలు సృజన దంపతులు బట్టలు పంపిణీ చేశారు.

గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణతో పాటు ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న పంచాయతీ కార్మికులకు పండుగ సందర్భంగా తమ వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో బట్టలు పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. గ్రామ పరిశుభ్రత, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో పంచాయతీ కార్మికుల సేవలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం కార్మికులకు తమ వంతు చేయూత అందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language