Type Here to Get Search Results !

అమెరికా పాఠశాలలో కాల్పుల కలకలం.. 16 ఏళ్ల బాలుడితో సహా ఐదుగురు మృతి

 అమెరికాలో పాఠశాలలో కాల్పులు.. ఐదుగురు మృతి


కాల్పులు జరిపిన 16 ఏళ్ల బాలుడు కూడా మృతి.. ముగ్గురు చిన్నారులు, ఉపాధ్యాయుడు బలి


తెలుగు ట్రెండ్స్, అక్టోబర్ 16:


అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఒరెగాన్ రాష్ట్రంలోని బెండ్ నగరంలో ఉన్న ఓ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఉదయం జరిగిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక న్యూస్‌ వెల్లడించింది. మృతుల్లో కాల్పులు జరిపిన 16 ఏళ్ల బాలుడితో పాటు ముగ్గురు చిన్నారులు, ఒక ఉపాధ్యాయుడు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో పాఠశాల పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఘటనలో ఐదు, ఎనిమిది, 11 ఏళ్ల వయసున్న ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. వీరితో పాటు ఓ ఉపాధ్యాయుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. పాఠశాలలో కాల్పులు జరిగిన వెంటనే పోలీసులు, అత్యవసర సహాయక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు.


ఈ కాల్పుల్లో ఏడేళ్ల బాలుడు, 54 ఏళ్ల ఉపాధ్యాయుడు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పాఠశాల పరిసర ప్రాంతాల్లో పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.


ఈ ఘటనకు గల కారణాలు, కాల్పులకు పాల్పడిన బాలుడి నేపథ్యం, పాఠశాలలోకి ఆయుధం ఎలా చేరిందనే అంశాలపై పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


తెలుగు ట్రెండ్స్ – తాజా వార్తలు మీకోసం.



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language