Type Here to Get Search Results !

చాకలి ఐలమ్మ జయంతి.. విగ్రహానికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఘన నివాళులు

 


సంగారెడ్డి, సెప్టెంబర్ 26 (తెలుగు ట్రెండ్స్):

చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమీపంలో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐలమ్మ సేవలను, పోరాట స్ఫూర్తిని ఎమ్మెల్యే స్మరించుకున్నారు.

ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ధైర్యసాహసాలతో పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తి చిరస్మరణీయమని అన్నారు. పేదలు, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

చాకలి ఐలమ్మ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల హక్కుల కోసం ఆమె చూపిన ధైర్యం, పోరాట పటిమను నేటి తరాలు గుర్తుంచుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి జగదీష్, నాయకులు రామప్ప, నగేష్, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొని చాకలి ఐలమ్మకు నివాళులర్పించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language