తూప్రాన్, సెప్టెంబర్ 28 (తెలుగు ట్రెండ్స్):
కుటుంబ కలహాల నేపథ్యంలో వెంకటేష్‌ను చిత్రహింసలకు గురిచేసి హత్య చేసిన కేసులో నిందితులైన అతని భార్య విజయ, ఆమె తండ్రి నర్సింలుకు జీవిత ఖైదు పడింది. ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున జరిమానా విధిస్తూ మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ తీర్పు వెలువరించినట్లు జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్ ఐపీఎస్ తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘనపూర్‌కు చెందిన దొడ్ల వెంకటేష్ (38) తన భార్య విజయ, ఇద్దరు కుమార్తెలతో కలిసి నివాసం ఉండేవాడు. కొంతకాలంగా కుటుంబ విషయాలపై భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. 2023 సెప్టెంబర్ 1న రాఖీ పండుగ సందర్భంగా విజయ తండ్రి నర్సింలు, ఇతర బంధువులతో కలిసి వెంకటేష్ ఇంటికి వచ్చారు.
అదే రోజు రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో వెంకటేష్‌ను కొబ్బరి తాళ్లు, చున్నీతో కట్టేసి దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అతడిపై వేడి నీళ్లు పోసి గదిలో ఉంచి తాళం వేసినట్లు కేసు దర్యాప్తులో వెల్లడైంది.
ఈ విషయాన్ని విజయ ఫోన్ ద్వారా వెంకటేష్ తమ్ముడికి తెలియజేయడంతో రామంతాపూర్‌కు చెందిన శ్రీనివాస్ ఘనపూర్‌కు చేరుకున్నాడు. గది తాళం పగలగొట్టి వెంకటేష్‌ను బయటకు తీసుకొచ్చి తూప్రాన్ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించగా, పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ వెంకటేష్ మృతి చెందాడు.
వెంకటేష్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి తూప్రాన్ ఎస్ఐ శివానందం కేసు నమోదు చేశారు. అప్పటి తూప్రాన్ సీఐ, దర్యాప్తు అధికారి శ్రీధర్ సమగ్ర దర్యాప్తు చేపట్టి కీలక సాక్ష్యాధారాలను సేకరించారు. అనంతరం కేసు విచారణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేష్ బలమైన వాదనలు వినిపించారు.
ప్రస్తుత దర్యాప్తు అధికారి వెంకట రాజాగౌడ్, ఎస్ఐ గంగరాజు సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. పోలీసులు సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ నిందితులు విజయ, నర్సింలుకు జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.
నిందితులకు శిక్ష పడేలా సమర్థవంతంగా దర్యాప్తు చేసి, పకడ్బందీగా సాక్ష్యాధారాలను సేకరించి కోర్టులో ప్రవేశపెట్టిన అధికారులు, సిబ్బందిని అదనపు ఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్ ఐపీఎస్ అభినందించారు. నేరాలకు పాల్పడిన నిందితులకు చట్ట ప్రకారం శిక్ష పడేలా పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
ఈ కేసులో కోర్టు లైజనింగ్ అధికారులు ఎస్ఐ విట్టల్, కానిస్టేబుల్ రవీందర్‌గౌడ్, సీడీఓ నాగరాజు సహకరించినట్లు అదనపు
ఎస్పీ తెలిపారు.
