Type Here to Get Search Results !

కాళ్లకల్‌లో ప్రభుత్వ భూమికి రక్షణ కరువు.. నాలుగుసార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆరోపణ

 తూప్రాన్/మనోహరాబాద్, సెప్టెంబర్ 28 (తెలుగు ట్రెండ్స్):


మనోహరాబాద్ మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ కాళ్లకల్‌లో ఉన్న సుమారు 7 ఎకరాల 21 గుంటల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురయ్యే ప్రమాదం ఉందని ఫిర్యాదుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని సునీల్ యాదవ్, పురం గిరిధర్, బంటు నాగేష్, చీర్ల ఇంద్రసేనా యాదవ్, ఊట్ల రమేష్, బోల్లెబోయిన పెంటయ్య తెలిపారు.


ఫిర్యాదుదారులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. కాళ్లకల్ గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నంబర్లు 368, 369లో సుమారు 7 ఎకరాల 21 గుంటల ప్రభుత్వ భూమి ఉన్నట్లు తెలిపారు. అయితే కొందరు వ్యక్తులు అధికారులతో కుమ్మక్కై 2003-04 సంవత్సరాల్లో ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వారు ఆరోపిస్తున్నారు.


గత ఏడాది మనోహరాబాద్ తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది ఈ భూమిలో సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా భూమి ప్రభుత్వానికి చెందినదని తెలియజేస్తూ హెచ్చరిక బోర్డును కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.


అయితే అనంతరం కొందరు వ్యక్తులు భూమిలోకి ప్రవేశించి రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డును తొలగించినట్లు ఫిర్యాదుదారులు ఆరోపించారు. అంతేకాకుండా ప్రభుత్వ భూమిలో ఉన్న పెద్ద చెట్లను నరికివేసి తరలించి విక్రయించారని ఆరోపణలు చేశారు. ఈ అంశంపై అధికారులు తక్షణమే విచారణ చేపట్టాలని వారు కోరుతున్నారు.


నాలుగుసార్లు ప్రజావాణిలో ఫిర్యాదు


ప్రభుత్వ భూమి ఆక్రమణకు సంబంధించిన అంశంపై జూన్ 30, ఆగస్టు 24, సెప్టెంబర్ 7, సెప్టెంబర్ 28 తేదీల్లో ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్యపై తగిన చర్యలు తీసుకోకపోవడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.


ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందని పేర్కొంటూ, ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని ఫిర్యాదుదారులు విజ్ఞప్తి చేశారు. సర్వే నంబర్లు 368, 369లోని భూమిపై సమగ్ర విచారణ నిర్వహించి, ప్రభుత్వ భూమి అని నిర్ధారణ అయితే ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడంతో పాటు హద్దులను పరిరక్షించాలని కోరారు.


అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని కాపాడేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కాళ్లకల్ గ్రామస్థులు విజ్ఞప్తి




చేస్తున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language