Type Here to Get Search Results !

తూప్రాన్‌లో రైతులకు శిక్షణ.. యాసంగిలో ఆరుతడి పంటల సాగుపై అవగాహన






తూప్రాన్, సెప్టెంబర్ 28 (తెలుగు ట్రెండ్స్):

తూప్రాన్ రైతు వేదికలో సోమవారం ఆత్మ (వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ) సౌజన్యంతో రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సేంద్రియ వ్యవసాయం, దాని ద్వారా కలిగే ప్రయోజనాలు, జీవన ఎరువుల వినియోగం, రాబోయే యాసంగి సీజన్‌లో సాగు చేయాల్సిన పంటలపై రైతులకు అవగాహన కల్పించారు.

కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ ఏరియా మేనేజర్ సుదర్శన్ రెడ్డి, శ్యాంసుందర్ మాట్లాడుతూ నానో యూరియా, నానో డీఏపీ, ఆర్గానిక్ గోదావరి కార్బన్, సేంద్రియ కర్బనం తదితర ఉత్పత్తుల లభ్యత, వినియోగం గురించి రైతులకు వివరించారు. పంటలకు అవసరమైన పోషకాలను సమతుల్యంగా అందించడం ద్వారా సాగు ఖర్చులు, పంట దిగుబడిపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు.

మండల వ్యవసాయ అధికారి పి. గంగామల్లు మాట్లాడుతూ రాబోయే యాసంగి సీజన్‌లో రైతులు పంటల ఎంపికపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటలను సాగు చేసేందుకు రైతులు మొగ్గు చూపాలని తెలిపారు. నూనెగింజలు, పప్పుదినుసుల పంటలను సాగు చేయడం ద్వారా పంటల వైవిధ్యాన్ని పెంచుకోవచ్చని సూచించారు.

ఒక ఎకరం వరి సాగు చేయడానికి అవసరమయ్యే నీటితో రెండు నుంచి మూడు ఎకరాల వరకు ఆరుతడి పంటలను సాగు చేసే అవకాశం ఉంటుందని గంగామల్లు తెలిపారు. నీటి లభ్యత, నేల స్వభావం, మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రైతులు పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్త ప్రతాపరెడ్డి, మండల వ్యవసాయ అధికారి పి. గంగామల్లు, ఏఈఓ కే. అభిలాష్ గౌడ్, ఏటీఎం సింధు, డీసీఎస్ వాలంటీర్లు, సీఎస్‌సీ సెంటర్ ప్రతినిధులు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language