Type Here to Get Search Results !

స్పర్శలేని మచ్చలపై అప్రమత్తం.. కుష్టు రహిత సమాజం కోసం అవగాహన

 



కుష్టు రహిత సమాజం కోసం సమష్టిగా కృషి చేయాలి

ప్రాథమిక దశలో గుర్తిస్తే కుష్టు వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు: వైద్యులు

మనోహరాబాద్, సెప్టెంబర్ 11 (తెలుగు ట్రెండ్స్):
కుష్టు వ్యాధి రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని రాష్ట్ర కుష్టు వ్యాధి నివారణ బృందం సభ్యులు పిలుపునిచ్చారు. కుష్టు వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన చికిత్స అందిస్తే పూర్తిగా నయం చేయవచ్చని తెలిపారు.

మనోహరాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర కుష్టు వ్యాధి నివారణ బృందం సభ్యులు డాక్టర్ సంపత్, డాక్టర్ వెంకటేశ్వర్ చారి, శ్రీనివాస్, డీపీఎం సంతోష్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్య సిబ్బందితో కుష్టు వ్యాధి నివారణ, గుర్తింపు, చికిత్సకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించి అవగాహన కల్పించారు.

కుష్టు వ్యాధి లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా వ్యాధి తీవ్రత పెరగకుండా అడ్డుకోవచ్చని వైద్యులు తెలిపారు. వైద్య సిబ్బంది గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ప్రజలకు కుష్టు వ్యాధిపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలు అనుమానాస్పద లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని కోరారు.

స్పర్శలేని మచ్చలు ఉంటే నిర్లక్ష్యం చేయొద్దు

శరీరంపై స్పర్శ లేని మచ్చలు కనిపించినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్య బృందం సూచించింది. తొలిదశలో వ్యాధిని గుర్తించి చికిత్స ప్రారంభిస్తే కుష్టు వ్యాధిని పూర్తిగా నియంత్రించి నయం చేయవచ్చని తెలిపారు.

అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఆసుపత్రి రిపోర్టులు, రికార్డులను రాష్ట్ర కుష్టు వ్యాధి నివారణ బృందం పరిశీలించింది. కుష్టు వ్యాధి గుర్తింపు, చికిత్స, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు.

కుష్టు వ్యాధిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, వ్యాధి లక్షణాలు ఉన్నవారు సకాలంలో చికిత్స పొందేలా అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. కుష్టు వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపకుండా వారికి అండగా నిలవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు జోష్నాదేవి, సమత, సూపర్‌వైజర్లు శారద, కృష్ణ, గంగమని, హేమలత, స్టాఫ్ నర్సులు వసంత, రేణుక, సిబ్బంది వెంకటేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language