బీసీలను ముందస్తు అరెస్టు చేసిన కొల్చారం పోలీసులు....
కొల్చారం,సెప్టెంబర్ 11( తెలుగు ట్రేండ్స్ న్యూస్ )
ముదిరాజ్ లను బీసీ డీ నుండి , బీసీఏలోకి మార్చాలని రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజులందరూ అసెంబ్లీ ముట్టడిని చేస్తున్న సందర్భంలో మండల కేంద్రమైన కొల్చారంలో శుక్రవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్లో ముదిరాజ్ నాయకుల ను ముందస్తు అరెస్టు చేశారు. ఇలాంటి ముందస్తు అరెస్టులు చేయడం ప్రభుత్వానికి సరైన పద్ధతి కాదని, రాష్ట్రంలోని ముద్దిరాజులందరికీ సరియైన న్యాయం జరిగేంత వరకు తమ వంతు పోరాటాన్ని సాగిస్తామని శాంతియుతంగా జరిగే ఈ కార్యక్రమాన్ని పోలీసు యంత్రాంగం చేత అనగదొక్కే విధంగా సరియైన పద్ధతి కాదని, కొల్చారం మండల ముదిరాజ్ సంగం యువత అధ్యక్షుడు రాజు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రమేష్, మహేష్, పుల్లబోయిన దుర్గేష్, సారా సుదర్శన్, చింతల యాదగిరి, ఉషయ్య, ఉసికే సుధాకర్ నర్సింలు వివిధ గ్రామాల ముదిరాజ్ సంఘం నాయకులు తదితరులు ఉన్నారు .
