Type Here to Get Search Results !

ఉపసర్పంచుల చెక్‌ పవర్‌ రద్దు చేయాలి.. కలెక్టర్‌కు సర్పంచుల వినతి

 

ఉపసర్పంచుల చెక్‌ పవర్‌ రద్దు చేయాలి.. కలెక్టర్‌కు సర్పంచుల వినతి

సర్పంచులకే పూర్తి స్థాయి ఆర్థిక అధికారాలు కల్పించాలని డిమాండ్‌

మెదక్‌,పాపన్నపేట సెప్టెంబర్‌ 9 (తెలుగు ట్రెండ్స్‌): గ్రామపంచాయతీల అభివృద్ధి పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నందున ఉపసర్పంచులకు కల్పించిన చెక్‌ పవర్‌ను రద్దు చేసి, సర్పంచులకే పూర్తి స్థాయి ఆర్థిక అధికారాలు కల్పించాలని పలు మండలాల సర్పంచులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం జిల్లాలోని పలు మండలాలకు చెందిన సర్పంచులు వేర్వేరుగా జిల్లా కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ను కలిసి వినతిపత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా శివ్వంపేట సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మురళిగౌడ్‌ మాట్లాడుతూ.. గ్రామాల్లో స్థానిక సమస్యల పరిష్కారంతో పాటు పారిశుధ్యం, తాగునీరు, అత్యవసర అభివృద్ధి పనులకు నిధులు ఖర్చు చేసే సమయంలో చెక్‌ పవర్‌ విషయంలో పలు సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు.

సాంకేతిక, రాజకీయ కారణాలతో చెక్‌ పవర్‌ విషయంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, దీని ప్రభావం నేరుగా గ్రామాల అభివృద్ధిపై పడుతోందని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగాలంటే సర్పంచులకు పూర్తి స్థాయి ఆర్థిక అధికారాలు ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

ఉపసర్పంచులకు చెక్‌ పవర్‌ ఇవ్వడం వల్ల ఇప్పటికే ఉన్న సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందని సర్పంచులు పేర్కొన్నారు. పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం సర్పంచులకే పూర్తి స్థాయి ఆర్థిక అధికారాలు కల్పించాలని కోరారు. గ్రామాల అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకె


ళ్లి తగిన పరిష్కారం చూపాలని కలెక్టర్‌ను కోరినట్లు మురళిగౌడ్‌ తెలిపారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం, తాగునీరు తదితర అత్యవసర పనులను సకాలంలో చేపట్టేందుకు ఆర్థిక అధికారాల విషయంలో స్పష్టత అవసరమని అన్నారు.

ఇదే అంశంపై రామాయంపేట మండలానికి చెందిన సర్పంచులు కూడా జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో శివ్వంపేట మండల సర్పంచుల ఫోరం ప్రధాన కార్యదర్శి యాదగిరి, కార్యదర్శులు లక్ష్మణ్‌, దుర్గయ్య, మౌనిక, నరేష్‌, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language