Type Here to Get Search Results !

కాళోజీ ఆశయాలే స్ఫూర్తి.. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

 


ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు

ప్రజా సమస్యలపై కలంతో పోరాడిన కాళోజీ సేవలు చిరస్మరణీయం

సంగారెడ్డి,అందోలు, సెప్టెంబర్‌ 9 (తెలుగు ట్రెండ్స్‌): ప్రజాకవి, తెలంగాణ వైతాళికుడు కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం కాళోజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కాళోజీ నారాయణరావు తన కలం ద్వారా సమాజంలోని అసమానతలు, ప్రజల సమస్యలు, సామాజిక రుగ్మతలపై నిరంతరం పోరాడారని కొనియాడారు. తెలంగాణ భాష, యాస, సంస్కృతి, ప్రజల ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

ప్రజల సమస్యలను తన రచనల ద్వారా వెలుగులోకి తీసుకువచ్చిన కాళోజీ, సామాజిక చైతన్యానికి తన సాహిత్యాన్ని ఆయుధంగా మలిచారని అన్నారు. ఆయన ఆశయాలు, ఆలోచనలు నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

కాళోజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. తెలంగాణ భాష, సంస్కృతి, సాహిత్య పరిరక్షణకు కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో చింత సాయినాథ్‌, మాజీ సీడీసీ చైర్మన్‌ బుచ్చిరెడ్డి, జీవీ శ్రీనివాస్‌, మసూద్‌, కసిని శ్రీకాంత్‌, వెంకటేష్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని కాళోజీ నారాయణరావుకు ఘనంగా నివాళులర్పించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language