Type Here to Get Search Results !

ఏడుపాయల్లో ఘనంగా అమ్మవారి పల్లకీ సేవ.. దుర్గా నామస్మరణతో మారుమోగిన పురమాడ వీధులు

పాపన్నపేట, సెప్టెంబర్ 26 (తెలుగు ట్రెండ్స్):

తెలంగాణలో ప్రసిద్ధి చెందిన శ్రీ ఏడుపాయల వనదుర్గామాత ఆలయ సన్నిధిలో శనివారం పౌర్ణమి సందర్భంగా అమ్మవారి పల్లకీ సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రంగురంగుల విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించి, ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి ఏడుపాయల పురమాడ వీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. పల్లకీ సేవ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. దుర్గా నామస్మరణతో ఏడుపాయల కొండలు, కోనలు మారుమోగాయి.

పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన పల్లకీ సేవలో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్, ప్రతాప్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, పల్లె సాయిబాబా, బ్రహ్మచారి, దీపక్ రెడ్డి, నరేష్, మహేష్, యాదగిరి, బలరాం తదితరులు పాల్గొన్నారు.



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language