వెల్దుర్తి మండలం, సెప్టెంబర్ 26 (తెలుగు ట్రెండ్స్):
వెల్దుర్తి మండలంలోని శెట్టిపల్లి కలాం గ్రామంలో అభివృద్ధి పనులకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి శనివారం శ్రీకారం చుట్టారు. స్థానిక సర్పంచ్ పడిగే శేఖర్తో కలిసి మహిళా సమైక్య భవన నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. అలాగే గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. పలు అభివృద్ధి పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేపట్టారు.
అనంతరం గ్రామంలో నిర్వహించిన వినాయక నిమజ్జన వేడుకల్లో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు తెలిపారు. వినాయక నిమజ్జనాన్ని భక్తిశ్రద్ధలతో పాటు శాంతియుతంగా, సోదరభావం, సామరస్యపూర్వక వాతావరణంలో నిర్వహించుకోవాలని ప్రజలకు సూచించారు.
వెల్దుర్తి మండలంలోని గ్రామాల్లో రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రమేష్ గౌడ్, వెల్దుర్తి మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోదండ కృష్ణ గౌడ్, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ప్రతాపరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు పడిగే నరసింహులు, జగ్గ అశోక్ గౌడ్, వెన్నవరం శ్రీనివాస్ రెడ్డి, ఏపీఎం సుభాష్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


