Type Here to Get Search Results !

చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు స్ఫూర్తిదాయకం – జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

 



తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు స్ఫూర్తిదాయకం

– జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

తెలుగు ట్రెండ్స్ న్యూస్, అందోలు ప్రతినిధి:
తెలంగాణ వీరవనిత, రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను శనివారం సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, ఆత్మగౌరవం ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఐలమ్మ పోషించిన పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు.

అణచివేతకు వ్యతిరేకంగా ఆమె చూపిన ధైర్యం, పట్టుదల, ఆత్మవిశ్వాసం తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచాయని ఎస్పీ తెలిపారు. సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం ఐలమ్మ చేసిన పోరాటాన్ని నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ అధికారి పద్మావతి, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ సదా నాగరాజు, ఆర్‌ఐలు సురేష్ నాయక్, రాజశేఖర్ రెడ్డి, ఎస్‌బీ ఎస్‌ఐలు, డీపీఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language